ఉల్లిపాయలను బాగా మెత్తగా గ్రైండ్ చేసి, ఒక బట్టలో తీసుకొని పిండితే రసం వస్తుంది. ఈ రసాన్ని తలకు పట్టించి , మృదువుగా ఒక 5 నిముషాలు మసాజ్ చేయాలి. 45 నిముషాలు వెయిట్ చేసి , గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి ఉల్లిపాయ రసం పుష్కలంగా 'క్యాటలైజ్' ఎంజైమ్'లను కలిగి ఉంటుంది మరియు దీన్ని చాలా సంవత్సరాలుగా నెరిసిన జుట్టుకు చికిత్సగా వాడుతున్నారు.
సహజసిద్ధంగా తల నెరవటం ఆపటానికి ఉల్లిపాయని తలకి రాయాలి అని మూళికల వైద్య నిపుణులు సలహాలిస్తున్నారు. ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని తలకు, కేశాలకు పట్టించాలి. తర్వాత తలకు టవల్ చుట్టి 25-30నిముషాల అలాగే ఉంచాలి. దాంతో హెయిర్ ఫాలీ సెల్స్ కు బాగా ప్రసరిస్తుంది.