కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

దేవీ

బుధవారం, 9 జులై 2025 (19:08 IST)
Kiran Abbavaram, K-Ramp Kerala
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. 
 
జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న " K-ర్యాంప్" సినిమా తాజాగా కేరళ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన సీన్స్ మూవీలో ఐ ఫీస్ట్ గా ఉండబోతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన హీరో కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న "K-ర్యాంప్"  మూవీ దీపావళికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 
నటీనటులు - కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు