బరువు తగ్గేందుకు గ్రీన్ టీ తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ టీ ఒక్క రోజులో శరీరంలోని దాదాపు 70 క్యాలరీల శక్తిని తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా దీన్ని తాగడం ద్వారా దీర్ఘకాలంగా ఫ్యాట్‌పై ఇది ఫైట్ చేస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత మరో కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల ఫ్యాట్‌ను బర్న్ చేస్తుంది.
ఊలాంగ్ టీలో రిచ్ యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం, మాగనీస్, కాపర్, పొటాషియం, విటమిన్ ఏబీసీఈ కే వంటి పోషకాలున్నాయి. ఫోలిక్ యాసిడ్, నియాసిన్ వంటివి కూడా ఉన్నాయి. ఈ టీ బరువు తగ్గించడంతో పాటు చర్మానికి మేలు చేస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఒత్తిడిని నిరోధిస్తుంది.