కమలాపండును భోజనానికి ముందు తీసుకోకూడదట.. తెలుసా?

శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (19:06 IST)
కమలాపండును తింటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కమలాపండ్లలో శరీరానికి అవసరమయ్యే యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా వుంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. బ్యాక్టీరియాపై పోరాటం చేస్తాయి. కమలా పండ్లలో వుండే నీటి శాతం కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. బీపీని తగ్గించే గుణం కమలాపండులు వుంది. 
 
కమలాపండులోని పొటాషియం, లైకోపీన్‌ పోషకం కాన్సర్‌ కారకాలతో పోరాడుతుంది. అయితే కమలా పండ్లను రోజుకు రెండేసి మాత్రమే తీసుకోవాలి. అలాగే భోజనానికి ముందు తీసుకోకూడదు. పరగడుపున తీసుకోకూడదు. 
 
ఎందుకంటే ఇందులోని ఆమ్లాలు పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని మరింత పెంచుతాయి. అలాగే పాలు తాగాక వెంటనే కమలాల జ్యూస్ తాగకూడదు. కనీసం గంట వ్యవధి ఉండాలి. ఎందుకంటే పాలలోని ప్రోటీన్లు కమలాలలోని ఆమ్లంతో కలిసి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు