మహిళలు.. నెలసరి సమస్యలకు చెక్ పెట్టాలంటే రోజూ ఎండుద్రాక్షలు తినండి. ద్రాక్షపండ్లలో నలుపు, పచ్చ, పనీర్, కాశ్మీర్, ఆంక్యూర్, కాబూల్, సీడ్ లెస్ ద్రాక్షలు వంటి అనేక రకాలున్నాయి. ముఖ్యంగా మహిళలు ఎండు ద్రాక్షలు లేదా ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణలు అంటున్నారు.
గర్భిణి మహిళలకు శక్తి కావాలంటే తప్పకుండా ఎండు ద్రాక్షలు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎండుద్రాక్షల్లో "బి" విటమిన్ ఉంది. గర్భిణీ మహిళలు ద్రాక్షపండ్లు తీసుకుంటే గర్భస్థ శిశువుకు కావాల్సిన శక్తి లభిస్తుంది. అందుచేత గర్భిణీ మహిళలు ఎండుద్రాక్షల్ని పాలులో కలిపి వేడి చేసి తాగుతూ వస్తే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది.