హైదరాబాద్, మే21, 2025: హైదరాబాద్‌లో ప్రముఖమైన ప్రసాద్ సినిమాస్ దగ్గర అభిమానులు, ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. అందరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ ప్రత్యేకమైన వేడుకలకు విలక్షణ నటుడు రానా దగ్గుబాటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వెర్సటైల్, డైనమిక్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. నెట్‌ఫిక్స్‌లో సూపర్ హిట్ అయిన సిరీస్ రానా నాయుడు సీజన్2 కోసం ఈ ఇద్దరు స్టార్స్ తమదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చేసి రానా నాయుడు సీజన్2 భారీ పోస్టర్‌ను విడుదల చేశారు.
రానా నాయుడు సీజన్2 కోసం ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ సరికొత్త ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయటం విశేషం. రానా నాయుడుగా నటిస్తే, రవుఫ్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించారు. ఇద్దరం ఢీ అంటే ఢీ అనేలా నటించాం. కానీ హైదరాబాద్‌లో నేను హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాను అని రానా తెలిపారు.