రోజూ అన్నం వార్చే గంజిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజు గంజి తాగడం ద్వారా శ్వాస కోస సంబంధిత వ్యాధులు.. ఉదర సంబంధిత వ్యాధులు, అలాగే గొంతుకి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిలో చిటికెడు.. ఉప్పు వేసుకుని తాగితే ఆకలి కూడా బాగా వేస్తుంది.
రాత్రి పడుకునే ముందు 'త్రిఫల చూర్ణం' ఒక చెంచాడు తీసుకొని గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగండి. రోగాలు దరిచేరవు. దీనితోపాటు పిజ్జా, బర్గర్, పానీపూరీ, బజ్జీలు, హోటల్ ఫుడ్‌కు దూరంగా వుండాలి. ఇంట్లోనే వుండుకుని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు