ఈత కాయలు తింటే ఏం జరుగుతుంది?

గురువారం, 29 డిశెంబరు 2022 (18:12 IST)
వేసవి రాగానే ఈత చెట్ల నుంచి కాసే ఈతకాయలు కూడా మార్కెట్లో కనబడుతుంటాయి. వీటిని తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
ఈత కాయలు తింటే అల్జీమర్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
ఈత కాయల్లో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది కనుక వీటిని తినేవారికి ఎముక పుష్టి కలుగుతుంది.
 
ఈత పండ్లను ఉదయం వేళల్లో తింటుంటే జీర్ణశక్తి పెరిగి మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
 
ఈత పండ్లు, ఈత కల్లులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త వృద్ధి జరుగుతుంది.
 
ఈత పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు.
 
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి ఈత పండ్లకు వున్నది.
 
వేసవిలో శరీర వేడిని తగ్గించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఈత కాయలు, ఈత కల్లు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు