నేరేడు విత్తనాలు, పొడపత్రి కాచు, పసుపు, ఎండు ఉసిరిక కలిపి చూర్ణం చేసుకుని దాన్ని చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే మధుమేహం అదుపులో వుంటుంది.
నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు గట్టిపడతాయి.
నేరేడు చెక్క కషాయాన్ని పుక్కిలిపడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి.
నేరేడు ఆకు చిగుళ్లు, మామిడి ఆకు చిగుళ్లు తీసుకుని వాటితో కషాయం కాచి, దానిలో తేనె చేర్చి సేవిస్తే పైత్యపు వాంతులు వెంటనే తగ్గిపోతాయి.
ముఖ్యమైన గమనిక ఏమిటంటే నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు.
ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా వైద్య సలహాలు తీసుకున్న తర్వాత నేరేడు పండ్లను తినాలి.