వాల్ నట్స్. ఇవి ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి. వాల్ నట్స్ ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వాల్ నట్స్‌లో వున్న ఫైబర్, ప్రోటీన్లు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. వాల్ నట్స్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని రకాల గుండె జబ్బులను ఎదుర్కొంటాయి.
వాల్ నట్స్ తింటుంటే అవి జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్, కెమికల్స్‌ను నాశనం చేస్తాయి. ఆహారంలో వాల్ నట్స్‌ను చేర్చుకోవడం చాలా మంచిది, ఇది బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. నానబెట్టిన వాల్ నట్స్‌ను ప్రతిరోజు 5 చొప్పున తీసుకుంటే కీళ్లనొప్పులు, వాపులు తగ్గిపోతాయి.