చెరుకు రసం తాగితే ఈ సమస్యలు తలెత్తవచ్చు

మంగళవారం, 14 నవంబరు 2023 (16:57 IST)
చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐతే ఈ రసంతో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. చెరుకు రసం సేవించేవారిలో కొందరికి ప్రతికూలమైన ఫలితాలు రావచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాము. చెరుకు రసం తాగితే శరీరానికి అత్యధిక క్యాలరీలు చేరిపోతాయి. చెరుకు రసం తీసిన 20 నిమిషాల లోపు సేవించకపోతే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.
 
చెరుకు రసం తాగేవారిలో నిద్రలేమి సమస్య తలెత్తవచ్చు. చెరుకు రసంలో ఉండే పోలికోసనాల్ రక్తాన్ని పల్చగా మార్చగలదు. చెరుకు రసం తయారీ ప్రక్రియ అపరిశుభ్రంగా వుండటం వల్ల చాలా త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంటుంది. చెరుకులో అత్యధిక చక్కెర ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిని విపరీతంగా పెంచుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు