అలాగే మెనోపాజ్ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోతుంటుంది. తద్వారా హృద్రోగం, మధుమేహం, అధికబరువు వంటి సమస్యలు వేధిస్తాయి. సోయాపాలును తీసుకుంటే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. సోయాలోని ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపాన్ని సవరిస్తుంది.
సోయా పాలలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. తద్వారా శరీరానికి కొత్త శక్తి అందుతుంది. ఇంకా చురుగ్గా పనిచేసేందుకు ఈ ధాతువులు ఉపయోగపడతాయి. ఈ పాలను తరచూ తీసుకోవడం వల్ల మోనో, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.