గుండెపోటు అలాంటివారికి వచ్చే అవకాశం తక్కువట

గురువారం, 3 మార్చి 2022 (23:44 IST)
గుండెపోటు. ఈ సమస్యతో ఇటీవలి కాలంలో మరణాలు సంభవిస్తున్నాయి. జీవనశైలి ప్రధానం కారణం అవుతుండగా తిండి అలవాట్లు మరింత సమస్యను పెంచుతున్నాయి. ఐతే ఈ గుండెపోటు ఎలాంటి వారికి రావచ్చు అనేదానిపై ఇటీవల పరిశోధనలు జరిగాయి. కొన్ని లక్షణాలను, మనిషి ఆకృతిని అనుసరించి సమస్య వచ్చే అవకాశం వున్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు.

 
ఎవరికైతే ఉంగరం వేలి కంటే చూపుడు వేలు పొడవుగా ఉందో.. వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు.. వయసు కూడా 35 నుండి 80 సంవత్సరాలు గలవారికి ఈ సమస్య ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేల్చి చెప్పారు.

 
చూపుడు వేలు, ఉంగరం వేలు రెండు సమానంగా ఉన్నవారికి గుండెపోటు రావడం చాలా కష్టమని కూడా వెల్లడించారు. అయినా చేతివేళ్లు ఎలా ఉన్నప్పటికీ గుండె రోగాలు వచ్చేందుకు రకరకాల కారణాలు ఉన్నాయని చెప్తున్నారు.

 
స్థూలకాయం ఉన్నవారు, ఒత్తిడి అధికం, జంక్‌ఫుడ్స్ ఎక్కువగా తినేవారికి గుండె పోటు ప్రమాదం ఎక్కువగా ఉంది. కనుక వీలైనంత వరకు ఈ సమస్యల నుండి ఎలా విముక్తి చెందాలో చూసుకోవాలి. 

 
పొగ తాగేవారు, మద్యం సేవించేవారు ఆ అలవాట్లు మానుకోవాలి. డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలన్నింటిని తగ్గించుకోవచ్చును.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు