పంచదార వద్దే వద్దు.. బెల్లం, పటిక బెల్లమే ముద్దు.. టీ, కాఫీల్లో..?

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (13:43 IST)
కాఫీ, టీల్లో చక్కెర అధికంగా వాడుతున్నారా? అయితే ఇక తగ్గించుకోండి. లేకుంటే ఒబిసిటీ వంటి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తప్పవ్. అధిక మొత్తంలో షుగర్ తీసుకోవడం ద్వారా మధుమేహం, హృద్రోగం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 
 
అధిక మొత్తంలో చక్కెరలను తీసుకోవటం వలన హార్మోన్, మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది, ఫలితంగా, ఊబకాయం లేదా స్థూలకాయానికి గురిచేస్తుంది. షుగర్ మనలో బరువు నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. కావున వీటికి తగిన మొత్తంలో మాత్రమే చక్కెరలను తీసుకోండి . 
 
చక్కెరలు ఎక్కువగా ఫ్రక్టోజ్‌ను కలిగి ఉంటాయి, ఇవి కాలేయం ద్వారా జీవక్రియలో గణనీయంగా ఉత్పత్తి చేయబడతాయి. కావున, అధిక మొత్తంలో చక్కెరలను తీసుకోవటం వలన కాలేయం తన విధిని సక్రమంగా నిర్వహించలేదు. దీని వలన కాలేయం కొవ్వు పదార్థాలతో నిండి, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగే అవకాశం ఉంది. 
 
పంచదారను అధికంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను కలుగచేస్తాయి. శరీరంలో ట్రైగ్లిసరైడ్‌ల స్థాయిలను, LDL, రక్తంలో చక్కెరల స్థాయిలను, ఇన్సులిన్ స్థాయిలను, ఉదరభాగంలో ఊబకాయాన్ని పెంచుతాయి. ఇవన్ని గుండె వ్యాధులను కలుగచేస్తాయి. పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం, పటిక బెల్లం వంటివి వాడితే కొంత మేరకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి