వేసవి కాలం వచ్చేస్తోంది. వేసవిలో ఆహారం విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. అందుకే డైట్‌లో వీటిని చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కలబంద, కొబ్బరి బోండాంలను ఉపయోగిస్తే వేడి తీవ్రతను తగ్గించుకోవచ్చు.
ఇంగువ - పావు టీ స్పూన్
కొత్తిమీర తరుగు- ఒక స్పూన్
తయారీ విధానం: కలబందను బాగా నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ గుజ్జును బౌల్‌లోకి తీసుకుని.. పావు కప్పు పెరుగును చేర్చాలి. ఆపై ఉప్పు, ఇంగువ పొడి, కొత్తిమీర పొడి చేర్చి మిక్సీలో రుబ్బుకోవాలి. ఆపై తగినంత నీటిని చేర్చి జ్యూస్‌లా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు వేసవి కాలంలో వేడి తాపం తగ్గుతుంది. వేసవిలో కారంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఏర్పడే అల్సర్‌ను.. కడుపులో మంటను ఇది దూరం చేస్తుంది. చర్మాన్ని సన్ టాన్ నుంచి కాపాడుతుంది.
శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తుంది. తద్వారా డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా డీ-హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. కొబ్బరి బోండాంతో పటికబెల్లం కలుపుకుని గంటకోసారి తీసుకుంటే నీరసం, అలసట దరిచేరదు. కొబ్బరినీటిలో వుండే మెగ్నీషియం, పొటాషియం డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.