కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు ఇందులో వున్నాయి.
కడుపు నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది. చింత చిగురును ఉడికించిన నీటితో నోటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫార్మేటరీ గుణాలు చింత చిగురులో వున్నాయి. తరచూ చింత చిగురును తీసుకుంటే ఎముకల ధృఢత్వానికి మేలు జరుగుతుంది. ఇందులోని ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.