రోజూ 3 కప్పుల కాఫీ తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా?

శనివారం, 31 మార్చి 2018 (11:19 IST)
రోజూ మీరెన్ని కప్పుల కాఫీ తీసుకుంటున్నారు? రోజుకు మూడు కప్పుల కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ సావో పౌలో శాస్త్రవేత్తలు తేల్చారు. కాఫీని తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను నియంత్రించవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 4,400 మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. 
 
రోజుకు మూడు కప్పుల కాఫీ తాగే వారిలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాల్షియం నిల్వలు తక్కువగా ఉన్నట్టు పరిశోధనలో వెల్లడి అయ్యింది. కాఫీని సేవించడం ద్వారా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతున్నట్లు కూడా గుర్తంచినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. 
 
కానీ రోజుకు మూడు కప్పుల కన్నా ఎక్కువ కాఫీ సేవించడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అతిగా కాఫీని సేవించడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు