కేన్సర్ అంటే ప్రజలలో చాలా అపోహలు నెలకొనివున్నాయి. కేన్సర్ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కేన్సర్ బాగా ముదిరిన తర్వాత డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తుంటారు. చాలామంది కేన్సర్‌కు చికిత్స లేదని భావిస్తుంటారు. కానీ ప్రస్తుతం మనకు అందుబాటులోనున్న వైద్య పరిజ్ఞానంతో కేన్సర్‌కు చికిత్స చేయవచ్చని వైద్యులు తెలిపారు.
సామాన్య లక్షణాలు ఏంటి?
శరీరంలోని ఏ ప్రాంతంలోనైనా కణితి లాంటిది ఏర్పడి ఉన్నట్టుండి రక్తం కారుతుంటే చర్మంలో కాసింత మార్పు సంభవించడం, ఆకలి లేకపోవడం, దగ్గు విపరీతంగా రావడం, దగ్గుతోబాటు రక్తం రావడం లాంటివి ఈ క్యాన్సర్‌కు నిదర్శనం.
చికిత్స ఎలా?
ముందుగా క్యాన్సర్‌ను కనిపెట్టడానికి బయోప్సి ద్వారా పరీక్షలు జరుపుతారు. ఇందులో క్యాన్సర్‌లోని చిన్న కణాన్ని తీసి దానిని పరీక్షకు పంపుతారు. దీనినే బయోప్సీ అంటారు. ఒక వేళ ఆ కణితి చిన్నదిగా ఉంటే ఆ మొత్తం కణితిని తీసి పరీక్షకు పంపుతారు. అదే పెద్దదైతే అందులోని చిన్నభాగాన్ని తీసి పరీక్షకు పంపుతారు. కేన్సర్ అని నిర్ధారించుకున్న తర్వాత ఏ చికిత్సనైతే మొదలుపెడుతారో దానినే 'కిమోథెరపీ' అంటారు.