మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

దేవీ

బుధవారం, 21 మే 2025 (16:52 IST)
Mohan lal look
మలయాళంలో స్టార్ మోహన్ లాల్ నటించిన సినిమా కన్నప్ప. మోహన్ లాల్ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా కన్నప్ప నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి అందరినీ ఆకట్టుకునే అప్డేట్‌ను వదిలారు.
 
కన్నప్ప మేకర్లు మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా ఒక అద్భుతమైన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, కనిపించిన తీరు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మోహన్ లాల్ ఈ చిత్రంతో మళ్లీ ఆడియెన్స్‌పై తన ముద్రను వేసేలా కనిపిస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించేలా ఈ గ్లింప్స్‌ను కట్ చేశారు. మోహన్‌లాల్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. 
 
దైవిక శక్తితో ముడిపడి ఉన్న కిరాత అనే పాత్రను మోహన్‌లాల్ పోషించారు. కిరాత పాత్రలో మోహన్‌లాల్ ప్రెజెన్స్, యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం విష్ణు మంచు, కన్నప్ప టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూఎస్ టూర్‌ను పూర్తి చేశారు. కన్నప్ప నుంచి వస్తున్న ప్రతి అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ పోస్టర్‌లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు