Nara Rohit, Balu, Shinnowala
కంటెంట్‌ను నమ్మి రాబోతున్న చిత్రం ''ఒక బృందావనం''. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు! బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రీ మూవీస్ ద్వారా ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరీలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.