పరగడుపున నీటిని సేవిస్తే.. ఎసిడిటీ మటాష్.. మెటబాలిక్ రేటు పెరుగుతుందట..

సోమవారం, 24 అక్టోబరు 2016 (17:49 IST)
పరగడుపున నీటిని సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రివేళ శరీరం టాక్సిన్స్‌ను సేకరిస్తుంది. ఆ టాక్సిన్స్ తొలగిపోవాలంటే.. ఉదయం బ్రష్ చేశాక పరగడుపున నీళ్లు తాగాలంటున్నారు. పరగడుపున నీళ్లు తాగితే పేగుల్లో కదలికలు పెరుగుతాయి.

ఉదయం పూట నీరు సేవించడం ద్వారా ఆ టాక్సిన్స్‌ తొలగిపోతాయి. అజీర్తి సమస్యకు కారణం పొట్టలో ఎసిడిటీ పెరిగిపోవడమే. గుండెలో మంటకు కూడా యాసిడ్‌ రిఫ్లక్స్‌ కారణమవుతుంది. పరగడపున నీళ్లు తాగితే యాసిడ్‌ డైల్యూట్‌ అయి సమస్య చాలా వరకు తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పరగడుపున నీటిని సేవించడం ద్వారా కనీసం మెటబాలిక్‌ రేటు 24 శాతం వరకు పెరుగుతుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కండర కణజాలంతో పాటు కొత్త రక్తకణాలు ఉత్పత్తి బాగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తలనొప్పి, శరీర నొప్పులు, గుండెపోటు, కిడ్నీ సంబంధిత రోగాలు, వేవిళ్లు, దంత సమస్యలు, డయాబెటిస్, కంటి రోగాలు, క్యాన్సర్, నెలసరి సమస్యలు, ఎముకల సంబంధిత వ్యాధులు, మూర్ఛ, చర్మ వ్యాధులు, ఆస్తమా, టీబీ  వంటి వివిధ సమస్యలకు నీటి ద్వారా వంద శాతం దూరమవుతాయి.

వెబ్దునియా పై చదవండి