వారాంతంలో జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళొద్దు.. ఎందుకంటే?

గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:15 IST)
వారంలో ఐదు రోజులు కష్టపడి పనిచేసేవారికి వీకెండ్ వస్తే చాలు.. చాలా హ్యాపీగా ఫీలవుతారు. వారం మొత్తం ఇంటి భోజనం తిని.. వారాంతం వచ్చేసరికి చాలామందికి హోటల్ ఫుడ్‌పై మనస్సు మళ్లుతుంది. అలాంటి వారు మీరైతే ఈ స్టోరీ చదవండి.


వారం మొత్తం ఎంత మంచి పౌష్టికాహారం తీసుకున్నా... ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా.. వారాంతంలో జంక్ ఫుడ్ జోలికి వెళ్లని వారి చాలా తక్కువ సంఖ్యలోనే వుంటారు. కానీ జంక్ ఫుడ్స్ వారాంతంలో తీసుకుంటే అనారోగ్యం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే రోజూ తీసుకునే జంక్ ఫుడ్ కన్నా వీకెండ్‌లో మితిమీరి తీసుకునే చిప్స్, బర్గర్‌లతో అనారోగ్య సమస్యలు తప్పవట. ఈ జంక్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా జీవక్రియ ప్రభావం వ్యాధినిరోధక వ్యవస్థపై వుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
 
ఏదైనా తేడా వస్తే పేగు సంబంధిత వ్యాధులు, ఒబిసిటీ వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే వారాంతంలో ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వారు సూచిస్తున్నాపు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు