వీకెండ్‌లో బాగా నిద్రపోతున్నారా? అయితే, అలసట తథ్యమంటున్న పరిశోధకులు

శనివారం, 17 సెప్టెంబరు 2016 (12:52 IST)
సాధారణంగా వీకెండ్ (వారాంతం) వచ్చిందంటే ప్రతి ఒక్కరూ నిద్రపోయేందుకు అధిక ప్రాధాన్యతనిస్తారు. వారమంతా కష్టపడి ఉంటారు కాబట్టి ఎక్కువగా నిద్ర పోవడం ద్వారా శరీరానికి కావాల్సినంత విశ్రాంతి లభిస్తుందని, అలసట దూరం అవుతుందన్నది ప్రతి ఒక్కరి భావన. కానీ, వీకెండ్‌లో పూర్తిగా నిద్రపోవడం వల్ల విశ్రాంతి లభించకపోగా శరీరానికి అలసట ఏర్పడుతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
ఇదే అంశంపై స్వీడన్‌లోని కరోలిన్స్ కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఓ సర్వే జరిపారు. వారాంతాల్లో ఎక్కువ సమయం పాటు నిద్రపోయే వారిపై జరిపిన ఈ పరిశోధనలో కొన్ని విషయాలను తెలుసుకున్నారు. వారాంతాల్లో అధిక సమయంతో పాటు నిద్రపోవడం వల్ల శరీర క్రమగతి తప్పుతుందట. దీంతో విశ్రాంతి లేకపోగా అదనపు ఇబ్బంది ఏర్పడుతుందన్నది పరిశోధన సారాంశం.

వెబ్దునియా పై చదవండి