కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చుంటున్నారా? హైటుకు తగిన వైట్ లేకుండా.. ఊబకాయంతో బాధపడుతున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. మంచినీటితో శరీర బరువు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చునని వాషింగ్టన్ పరిశోధకులు తేల్చారు. అధికంగా నీరు తాగడం ద్వారా ఆరోగ్యవంతమైన బరువును పొందడంతో పాటు.. ఊబకాయం దరిచేరదని పరిశోధనలో వెల్లడైనట్లు పరిశోధకులు వెల్లడించారు.
బాడీమాస్ ఇండెక్స్‌కు తగినట్లుగా శరీర బరువు ఉండేందుకు మంచినీరు దోహదపడుతుందని అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన ప్ర్రొఫెసర్ టమ్మి చాంగ్ వెల్లడించారు. నీరు ఎక్కువగా తాగటం వల్ల అధికంగా తినటాన్ని నివారిస్తుందని తద్వారా బరువు తగ్గొచ్చునని పరిశోధకులు తెలిపారు. 9,528 మంది నుంచి వివరాలు సేకరించడం ద్వారా ఈ విషయం వెల్లడైంది.