వంకాయ పోషకాలకు నిలయం. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో వంకాయను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంకాయ తొక్కలో ఉండే యాంథోసియానిన్స్ శరీరానికి ఎంతో మంచిది. క్యాన్సర్ కారకాలతో పోరాడటానికి ఈ యాంటీ ఆక్సిడెంట్‌లు దోహదపడతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారు వంకాయ తింటే చాలా మంచిది.
వంకాయ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కే శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. వంకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినవచ్చు. జీర్ణక్రియ సాఫీగా జరగడానికి కూడా ఇది తోడ్పడుతుంది. ఇది మంచి డైట్ ఫుడ్. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.
నరాల వ్యాధితో బాధపడేవారు వంకాయను తింటే మంచిది. వంకాయ ఆకలిని పెంచుతుంది. దగ్గు, జలుబు, కఫం ఉన్నవారు వంకాయ ఆకుల రసంలో కొద్దిగా తేనె కలుపుకుని మూడుపూటలా తాగితే ఉపశమనం పొందవచ్చు.