పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

బుధవారం, 22 జూన్ 2022 (23:23 IST)
పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. అవేంటో చూద్దాం. పాలలో ఉండే కాల్షియం మన దంతాలు, ఎముకలను బలంగా చేస్తుంది. ఇది మన శరీరానికి, కండరాలకు శక్తిని ఇవ్వడానికి అవసరం. ఎవరికైనా మలబద్ధకం సమస్య ఉంటే, తేలికపాటి గోరువెచ్చని పాలు ప్రయోజనకరంగా ఉంటాయి.

 
సాధారణంగా వేసవిలో డీహైడ్రేషన్ సమస్య కొనసాగుతుంది, ముఖ్యంగా వర్క్ అవుట్, శారీరక శ్రమ చేసే వారికి. అటువంటి పరిస్థితిలో, శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి పాలు గొప్ప ఎంపిక. వెచ్చని పాలు తాగడం వల్ల రోజులోని అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. దీనితో పాటు, ఇది నిద్రలేమి సమస్యను కూడా తొలగిస్తుంది, దీని వలన పూర్తిస్థాయి నిద్ర పడుతుంది.

 
పాలు త్రాగడానికి సరైన సమయం ఏంటి?
ఉదయం ఒక గ్లాసు పాలతో ప్రారంభించినట్లయితే, అది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. మీరు జిమ్మర్ అయితే అరగంట వర్కవుట్ చేసిన తర్వాత పాలు తాగితే మీ శరీరానికి శక్తితోపాటు అవసరమైన పోషకాహారం అందుతుంది. చల్లని పాలు ఉదయం మీకు రిఫ్రెష్, రాత్రి నిద్రపోయే ముందు వెచ్చని పాలు అలసట నుండి ఉపశమనం ఇస్తుంది. నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు