కమలా పండ్లను తింటే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

సోమవారం, 4 డిశెంబరు 2023 (17:07 IST)
ఈ సీజన్‌లో మార్కెట్లోకి కమలా పండ్లు వచ్చేస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి గురించి తెలిస్తే కమలా పండ్లు తినకుండా వుండరు. కమలాలను తింటే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలా పండ్లు తింటే బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. కమలా పండ్లలో వున్న విటమిన్లు వృద్ధాప్య లక్షణాలను త్వరగా రానీయవు.
 
రక్తపోటు స్థాయిలను నియంత్రించే గుణం వీటిలో వుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి కమలా పండ్లకు వుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రణకు తోడ్పాటునిస్తాయి.
 
కిడ్నీ స్టోన్స్‌ను నివారించడంలోనూ ఇవి ప్రయోజనకారిగా వుంటాయి. రక్తహీనత పోవాలంటే కమలాలను తింటుండాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు