ధ్యానం లేదా మెడిటేషన్. ధ్యానం చేస్తే పలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయంటారు. అంతేకాదు, మనసు ప్రశాంతంగా మారడంతో సానుకూల దృక్పథం ఏర్పడి జీవితంలో రాణిస్తారు. ధ్యానంతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ధ్యానంతో మానసిక, శారీరక శ్రేయస్సు కలుగుతుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులపై కొత్త దృక్పథాన్ని పొందే శక్తి వస్తుంది.