రక్తపోటు వున్నవారు తాంబూలం సేవిస్తే ఏమవుతుంది?

శనివారం, 11 జులై 2020 (22:38 IST)
తమలపాకులతో తాంబూలం సేవించడం చాలామంది చేస్తుంటారు. ఐతే అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు. ఎందుకంటే తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
 
ఇంకా తమలపాకులతో కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. తమలపాకు, సున్నం, వక్క మూడూ చక్కని కాంబినేషన్. సున్నం వల్ల ఆస్టియోపోరోసిస్... అంటే ఎముకలు గుల్లబారటం సమస్య రాకుండా ఉంటుంది. తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.
 
ఔషధంగా తమలపాకుని వాడుకోవాలనుకున్నవారు దాని రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి. ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
 
తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు