రక్తహీనత తగ్గేందుకు 100 గ్రాముల నల్ల నువ్వులలో, 100 గ్రాముల బెల్లం కలిపి దంచి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఉసిరికాయంత తిని, ఆ తర్వాత 100 మిల్లీ లీటర్ల పాలు లేదా, గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు వున్నవారు నువ్వుల చూర్ణం, సొంఠి చూర్ణం సమానంగా కలిపి ఉంచుకొని రెండు పూటలా పూటకు అర టీస్పూన్ చొప్పున తేనెతో కలిపి వాడాలి. చక్కెర వ్యాధి ఉన్నవాళ్లు 100 మిల్లీ లీటర్ల పాలు లేదా నీళ్లతో కలిపి త్రాగాలి.
నోటిపూత తగ్గేందుకు నువ్వుల చూర్ణం, పటికబెల్లం పొడి ఒక్కొక్కటి 50 గ్రా. చొప్పున తీసుకొని రెండింటిని కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. రెండు పూటలా అరస్పూన్ పొడిని ఒక టీస్పూన్ వెన్నతో కలిపి సేవించడం వలన నోటిపూత తగ్గుతుంది.