హిమోగ్లోబిన్ పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (16:25 IST)
మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఈ కింది వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి....
పొద్దున టిఫిన్‌తో పాటు ఒక గ్లాసు పాలు, ఒక పండు, నాలుగైదు ఖర్జూరాలు తీసుకోవాలి. 
సాయంత్రం నాలుగు గంటలకు రాగిజావ, ఒక అరటిపండు తీసుకోవాలి. 
భోజనంలో ప్రతిరోజూ పప్పు, ఆకుకూర ఉండేట్లు చూసుకోండి. 
పడుకునే ముందు ఒక గుప్పెడు వేరుశనగలు, కాస్తబెల్లం, నాలుగైదు ఖర్జూరాలు తీసుకున్నట్టయితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి