బరువు తగ్గాలా? అయితే గోధుమ రవ్వను ఉపయోగించండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోధుమ రవ్వ వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించడంలో దోహదపడుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్ 'B' అధికంగా ఉంటుంది. బరువు తగ్గటం కోసం గోధుమ రవ్వను తినే వారిని చూసే ఉంటారు.
రోజు గోధుమ రవ్వను తినని ఆడవారితో పోలిస్తే, రోజు తినే ఆడవారి శరీర బరువు తక్కువగా ఉందని పరిశోధనలు తేల్చాయి. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గించుటకు గానూ, వీటిలో అధిక మొత్తంలో పోషకాలతో పాటుగా, తక్కువ క్యాలోరీలను కలిగి ఉంటాయి. గోధుమ రవ్వ అధిక మొత్తంలో ఫైబర్ స్థాయిలను కలిగి ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ లు జీర్ణవ్యవస్థను సజావుగా జరపటమే కాకుండా, శరీర భాగాల అన్ని విదులను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించేలా ప్రోత్సహించి పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గోధుమ రవ్వ అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉంటుంది కావున, జీర్ణాశయంలో గ్రహించబడటానికి కూడా ఎక్కువ సమయంపడుతుంది. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను తినటం వలన త్వరగా ఆకలిగా అనిపించే భావనకు గురి అవుతారు. కానీ, కొద్ది మొత్తంలో తినే గోధుమ రవ్వ చాలా సమయం పాటు ఆకలి కాకుండా చూస్తుంది. అందుచేత రోజూ ఒక కప్పు గోధుమ రవ్వ ఉప్మాను డైట్‌లో చేర్చుకుంటే బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.