చలికాలంలో క్యాలీఫ్లవర్ జ్యూస్.. వెల్లుల్లి పాలను తీసుకుంటే?

శుక్రవారం, 27 డిశెంబరు 2019 (11:20 IST)
చలికాలంలో క్యాలీఫ్లవర్ సూప్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు క్యాబేజీలో పోషకపదార్థాలు పుష్కలంగా వుంటాయి. క్యాబేజీలో ఉండే సల్ఫర్ శరీలంలో తెల్ల రక్తకణాలను పెంచుంది. చలికాలంలో క్యాబేజీ సలాడ్‌ తింటే మంచిది.

అలాగే విటమిన్ సి వుండే పండ్లు ఆరెంజ్, గ్రేప్స్ వంటివి తీసుకోవాలి. చలికాలంలో శరీరానికి ఎనర్జీ కావాలంటే నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష తీసుకోవాలి. అయితే జ్యూస్‌గా తాగాలనుకుంటే.. కాచి చల్లార్చిన నీటితో తయారు చేసిన జ్యూస్‌లు తీసుకోవడం మంచిది. అలాగే రాత్రిళ్లు కాకుండా మధ్యాహ్నం సమయంలో పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. 
 
ఇంకా వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీన్ని ఆహారంతో పాటు తీసుకోవడం ద్వారా అనారోగ్యాల నుంచి తప్పుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో రోజూ రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటే బ్యాక్టీరియా, వైరస్ ద్వారా వ్యాపించే దగ్గు, జలుబుని నయం చేసుకోవచ్చు. వెల్లుల్లిని పాలతో కాసేపు ఉడికించి తినడం ద్వారా గొంతు సమస్యలకు చెక్ పెట్టొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు