రోజూ దానిమ్మను తినండి.. నిత్యం యవ్వనంగా ఉండండి!

బుధవారం, 13 జులై 2016 (11:50 IST)
రోజూ దానిమ్మ పండును తినండి. యవ్వనంగా ఉండండి అంటున్నారు వైద్యులు. వృద్ధాప్యాన్ని దరిచేరనీయకుండా.. నిత్యయవ్వనంతో కాంతులీనాలనుకుంటే మాత్రం దానిమ్మను రోజూ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కణజాలం బలహీనపడుతుంది. అలా జీవకణంలో ఏర్పడిన మార్పుతో శరీర వ్యవస్థ సత్తువ కోల్పోతుంది.
 
ఈ కారణంగానే యవ్వనంలో దేహదారుఢ్యంతో ఉన్నవారు కూడా వృద్ధాప్యంలో కండలు కరిగి బలహీనంగా కనిపిస్తుంటారు. ఇంకా చర్మం ముడతలు పడతాయి. వీటికి చెక్ పెట్టాలంటే.. దానిమ్మ పండు రోజూ తీసుకుంటే సరిపోతుందని.. ఎందుకంటే.. దానిమ్మలో ''యూరోలిథిన్‌ ఏ" అనే పదార్థం జీవకణాల్లోని శక్తి కేంద్రాల పనితీరును ద్విగుణీకృతం చేస్తున్నట్లు వెల్లడైంది.
 
దానిమ్మను రోజు వారీగా అరకప్పు తీసుకోవాలి. సలాడ్‌లలోనూ ఉపయోగించుకోవచ్చు. స్వీట్లు, సూప్‌లలో కలిపి తీసుకోవాలి. ఇలా రోజూవారీగా దానిమ్మను తీసుకునే వారిలో విటమిన్ ఏ లోపం ఉండదని పరిశోధకులు అంటున్నారు. అంతేగాకుండా దానిమ్మను తీసుకునేవారిలో మిగిలిన వారికంటే 45 శాతం ఆయుర్దాయం పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి