గర్భాశయ క్యాన్సర్‌ అరుదైన కేసుకు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

ఐవీఆర్

మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (18:38 IST)
విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ), మంగళగిరి అత్యంత అరుదైన గర్భాశయ కాన్సర్‌కు విజయవంతంగా చికిత్స అందించింది. గర్భాశయ క్యాన్సర్‌లలో అతి అరుదుగా, అంటే కేవలం 5% కంటే తక్కువ మాత్రమే కనిపించే ప్రాణాంతకమైన గర్భాశయ లియోమయోసార్కోమా   కేసుకు విజయవంతమైన చికిత్సతో ఆంకాలజీ రంగంలో మహోన్నత మైలురాయిని ఏఓఐ సాధించింది.
 
42 ఏళ్ల మహిళ, పొత్తికడుపు పెరగడం, ఒక నెల నుంచి నొప్పి సమస్యలతో హాస్పిటల్‌కు వచ్చారు. ఆమెకు పరీక్షలు చేసిన తర్వాత, ఎంఆర్ఐ పరీక్షలో ఆమె గర్భాశయంలో 20x19cm కణితి ఉన్నట్లు గుర్తించబడింది. ఇది అధిక రక్త ప్రసారంని సైతం ప్రదర్శిస్తుంది. బయాప్సీ ఫలితాలు గర్భాశయం యొక్క లియోమయోసార్కోమాగా నిర్ధారించాయి. ఈ కేసు యొక్క తీవ్రతను మరింతగా పెంచుతూ, రోగి ఇంట్లో పడిపోవటం వల్ల ఎడమ తొడ ఎముక చిట్లింది. ఈ కారణం చేత ఆమె ఎడమ కాలుకు ‘హెమి ఆర్ధోప్లాస్టి’ కూడా చేశారు.
 
ల్యూకోసైటోసిస్, హైపోఅల్బుమినిమియా, రక్తహీనత, ఎలక్ట్రోలైట్ సరిగా లేకపోవటంతో పాటుగా అంతకుముందే ఆమెకు ‘హెమి ఆర్ధోప్లాస్టి’ జరగటం వంటి కారణాలు పరిగణనలోకి తీసుకుని, ఈ రోగికి చికిత్స సవాలుగా నిలిచింది. ఏఓఐ మంగళగిరిలోని డాక్టర్ శ్రీకాంత్ & డాక్టర్ కళ్యాణ్ నేతృత్వంలోని  నైపుణ్యం కలిగిన బృందం కేసు యొక్క సంక్లిష్టతను గుర్తించి, సమగ్ర చర్యలను ప్రారంభించింది.
 
ఇటీవలి తొడ ఎముక శస్త్రచికిత్సతో సహా అనేక కారణాల వల్ల రోగికి శస్త్రచికిత్స వల్ల ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, డాక్టర్ల బృందం గర్భాశయ శస్త్రచికిత్సను కొనసాగించింది. కణితి లోని అధిక రక్త  ప్రసరణ దృష్ట్యా, శస్త్రచికిత్స సమయంలో సంభవించే రక్త నష్టాన్ని తగ్గించడానికి, రోగి యొక్క మొత్తం ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి గర్భాశయ ధమనికి శస్త్రచికిత్సకు ముందు యాంజియోఎంబోలైజేషన్ చేయబడింది.
 
ఏఓఐ మంగళగిరిలోని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్ పోలవరపు మాట్లాడుతూ, "ఈ హై -రిస్క్ కలిగిన రోగిలో గర్భాశయ లియోమయోసార్కోమా యొక్క విజయవంతమైన నిర్వహణ, వినూత్నమైన మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించడంలో మా నిబద్ధతను ఉదహరిస్తుంది. శస్త్రచికిత్సకు ముందు, శస్త్రచికిత్స అనంతర సంరక్షణతో పాటు శస్త్రచికిత్సకు ముందు యాంజియోఎంబోలైజేషన్ చేయటం, ఈ కేసు యొక్క సంక్లిష్టతలను సమర్థవంతంగా పరిష్కరించడానికి మాకు తోడ్పడింది" అని అన్నారు. 
 
ఏఓఐ యొక్క రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (RCOO) శ్రీ మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ, " ఏఓఐలో, అసాధారణమైన ఆంకోలాజికల్ సొల్యూషన్‌లను అందించడంలో మేము ముందంజలో ఉన్నందుకు గర్విస్తున్నాము. ఈ విజయవంతమైన కేసు మా బృందం యొక్క నైపుణ్యం, ఆవిష్కరణ, పేషెంట్ ఫలితాలను మెరుగుపరచడంలో మా నిబద్ధతకు నిదర్శనం. కమ్యూనిటీకి అత్యాధునిక సంరక్షణను అందించాలనే మా మిషన్‌లో మేము స్థిరంగా ఉంటాము" అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు