ప్రపంచంలో సుప్రసిద్ధ ఏఐ మరియు ఐపీ ఆధారిత డిజిటల్ అస్యూరెన్స్, డిజిటల్ ఇంజినీరింగ్ సేవల కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్ నల్గొండ జిల్లాలోని తల్లి- పిల్లల ఆరోగ్య కేంద్రంలో ఎన్‌ఐసీయు/ఎస్‌ఎన్‌సీయు సదుపాయాలను ప్రారంభించింది. ఈ కంపెనీ సీఎస్‌ఆర్ ప్రయత్నాలలో భాగంగా ఈ కేంద్రం ప్రారంభించడమనేది ప్రభుత్వ ఆస్పత్రులలో అత్యుత్తమ మౌలిక వసతులు అందించడం ద్వారా దీర్ఘకాలిక ప్రభావం సృష్టించాలనే ప్రయత్నాలలో భాగం.
ఈ కేంద్రాన్ని సిగ్నిటీ టెక్నాలజీస్ ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సీ వీ సుబ్రమణ్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంఎల్‌ఏ శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి; సిగ్నిటీ లీడర్‌షిప్ శ్రీ సాయిరామ్ వేదం, శ్రీమతి ఉర్మిలా మార్కిలి, శ్రీ మిధున్ పింగిళి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఫౌండర్-సీఈఓ మయూర్ పట్నాల పాల్గొన్నారు.
ఎన్‌ఐసీయు/ఎస్‌ఎన్‌సీయు పడకల కొరత సమస్యను తీర్చేందుకు నిర్మాణ్ ఆర్గనైజేషన్‌తో సిగ్నిటీ చేతులు కలిపింది. వైద్య పరికరాలైనటువంటి రేడియంట్ వార్మర్స్, ఫోటో థెరఫీ మెషీన్స్, పల్స్ ఆక్సిమీటర్లు, సిరెంజ్ మరియు ఇన్ఫ్యూజన్ పంపులు, మల్టీ పారా మానిటర్స్, హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ మెషీన్లు, వార్డుకు ఎయిర్‌కండీషనర్లు వంటివి అందించింది. ఇవన్నీ కూడా నెలలు నిండకుండానే జన్మించిన లేదంటే తీవ్ర అనారోగ్యం బారిన పడిన 28 రోజుల కంటే తక్కువ వయసున్న నవజాత శిశువుల చికిత్సలో కీలకం. ఈ సదుపాయాలు ఇప్పుడు జిల్లా కేంద్రంలో 14 లక్షల మంది ప్రజలతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తోడ్పడతాయి. ఈ ఆధునీకరించిన సేవలతో సంవత్సరానికి 1000 మంది శిశువులకు ప్రయోజనం కలుగుతుంది.
ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలన్నది మా ప్రయత్నం. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు లేమి కారణంగా అత్యధిక సంఖ్యలో శిశువులు మరణించడమూ జరుగుతుంది. జీవితాలను కాపాడే అత్యంత కీలకమైన వైద్య సదుపాయాలను అందించడం ద్వారా నల్గొండ ప్రజలకు మా సహకారం మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాముఅని సిగ్నిటీ టెక్నాలజీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి.వి. సుబ్రమణ్యం అన్నారు.