అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

ఐవీఆర్

బుధవారం, 3 జులై 2024 (22:59 IST)
అతి క్లిష్టమైన అత్యవసర న్యూరో సర్జరీ ప్రక్రియ ద్వారా 23 ఏళ్ల రోగిని హైదరాబాదులోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ కాపాడింది. శ్రీ రాజ్ (పేరు మార్చబడినది) పలుమార్లు మూర్ఛపోవడం (రోజుకు 5-6 సార్లు), అతని కుడి ఎగువ, దిగువ అవయవాలు పూర్తి బలహీనంగా ఉండటం, అఫాసియా (మాటను అర్థం చేసుకోవడం లేదా వ్యక్తీకరించే సామర్థ్యం కోల్పోవడం), మూతి వంకర పోవటం వంటి సమస్యలతో ఆసుపత్రికి తీసుకురాబడ్డారు. ఈ లక్షణాలు అతని హాస్పిటల్ ప్రవేశానికి ముందు మూడు రోజుల నుంచి కూడా కనిపించసాగాయి.
 
అతనిని పరీక్షించిన తర్వాత, లెఫ్ట్ ఫ్రంటల్ హెమరేజిక్ ఇన్‌ఫార్క్ట్‌తో శ్రీరాజ్ ఇబ్బంది పడుతున్నారని గుర్తించటం జరిగింది. మెదడులో రక్తస్రావం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. ఫ్రంటల్ హెమరేజిక్ ఇన్‌ఫార్క్ట్ వల్ల ఏర్పడిన సెన్సోరియం మారటం వల్ల మూర్ఛతో బాధపడుతున్నట్లు నిర్ధారించబడింది. సిరలలో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే వీన్ త్రంబోసిస్ దీనికి అంతర్లీన కారణం అని గుర్తించబడింది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గించవచ్చు లేదా నిరోధించవచ్చు. ఈ కారణంగా వాపు, నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో స్ట్రోక్‌లు లేదా ఇతర క్లిష్టమైన పరిస్థితులకు దారితీయవచ్చు. శ్రీ రాజ్ విషయంలో, వీన్ త్రంబోసిస్ వల్ల మెదడుకు రక్త ప్రసరణలో తీవ్ర అంతరాయం కలిగింది, ఇది హెమరేజిక్ ఇన్ఫార్క్ట్  తరువాత మూర్ఛకు దారితీసింది.
 
న్యూరోసర్జన్ డాక్టర్ రాజేష్ రెడ్డి సన్నారెడ్డి ఈ కేసు తీవ్రత గమనించారు. ఈ కేసు యొక్క అత్యవసర స్థితిని దృష్టిలో ఉంచుకుని, అతను అర్ధరాత్రి ఫ్రంటో టెంపోరోపారిటల్ డికంప్రెసివ్ క్రానిఎక్టమీ అనే అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ఈ శస్త్రచికిత్సలో మెదడుపై ఒత్తిడిని తగ్గించడానికి పుర్రెలో కొంత భాగాన్ని తొలగించడం జరుగుతుంది, ఇది అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుతుంది. సకాలంలో శస్త్ర చికిత్స చేసి ప్రాణాలను కాపాడి కోలుకోవడానికి మార్గం సుగమం చేసింది. 2 నెలల తర్వాత ఎముకను మార్చడానికి రెండవ శస్త్రచికిత్స జరిగింది. అతను ఇప్పుడు సాధారణ మెదడు పనితీరుతో తన పనులు తాను చేసుకోగలుగుతున్నాడు.
 
డాక్టర్ రాజేష్ రెడ్డి సన్నారెడ్డి, కోవిడ్ అనంతర ఆందోళనకరంగా మారిన ధోరణిని వెల్లడిస్తూ: "కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ల తరువాత వీన్ త్రంబోసిస్ కేసులు పెరగడాన్ని మేము గమనించాము. ఈ పరిస్థితి సాధారణంగా మహిళల్లో చాలా సాధారణం అయినప్పటికీ,ఎవరినైనా ఇది ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండటం అత్యవసరం.." అని అన్నారు.
 
సత్వరమే స్పందించటంతో పాటుగా అత్యున్నత నైపుణ్యం ప్రదర్శించిన తమ బృందాన్ని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క ఆర్ సిఓఓఓ డాక్టర్ ప్రభాకర్ పి అభినందించారు. ఆయన మాట్లాడుతూ,"అత్యంత ఖచ్చితత్వంతో, జాగ్రత్తతో అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి మా బృందం అధిక శిక్షణ పొందింది. మా న్యూరోసర్జరీ విభాగం యొక్క సంసిద్ధత, వేగవంతమైన చర్య అత్యంత సవాలుగా ఉన్న పరిస్థితుల్లో కూడా మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడంలో మా నిబద్ధతను ఉదహరిస్తుంది" అని అన్నారు. 
 
సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని నైపుణ్యం కలిగిన బృందం సమయానుకూలంగా, సమర్ధవంతంగా చికిత్స అందించడం వల్ల శ్రీ రాజ్ ఇప్పుడు కోలుకునే మార్గంలో ఉన్నారు. సకాలంలో రోగ నిర్ధారణ, అత్యవసర శస్త్రచికిత్స, కుటుంబ సభ్యుల నడుమ సహనం & బృంద కృషిని రికవరీకి కీలకమైనదిగా ఈ కేసు హైలైట్ చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు