కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు, వృద్ధులు, ఒంటరిగా ఉన్నవారు, వైద్య సిబ్బంది, పోలీసులు తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఐరాస పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఒక డాక్యుమెంట్‌ను సైతం విడుదల చేసారు.
కరోనాతో పోరాటం చేయడంతో పాటు మానసిక సమస్యల పట్ల ప్రభుత్వాలు ప్రాధాన్యతను ఇవ్వాల్సిందిగా సూచించింది. సొసైటీ బాగుండాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని యూఎన్ పేర్కొంది. మానసిక వ్యాధులు ఎక్కువైతే, పరిస్థితులు గందరగోళంగా ఉండవచ్చని హెచ్చరించింది.