మెరుగైన కుటుంబ ఆరోగ్యాన్ని నిర్థారించడానికి స్మార్ట్ స్నాకింగ్ ఎంపికల ఆవశ్యకత
మంగళవారం, 28 జూన్ 2022 (11:48 IST)
స్నాకింగ్‌ను తరచుగా అనారోగ్యకరమైన రీతిలో బరువు పెరిగేందుకు భావిస్తుంటారు. అంతేకాదు, పలు ఆరోగ్య సమస్యలకు హేతువుగానూ భావిస్తారు. అయినప్పటికీ, అవసరమైన మినరల్స్, పోషకాలు శరీరానికి అందించడానికి ఇది ఓ సమర్థవంతమైన మార్గం.
కుటుంబ ఆరోగ్యం మెరుగ్గా నిర్వహించడం కోసం ఆరోగ్యవంతమైన స్నాకింగ్ ఆవశ్యకతను తెలుపుతూ ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. స్మార్ట్ స్నాకింగ్ ఛాయిసెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్‌ఆన్ ఫ్యామిలీ హెల్త్ (చక్కటి స్నాకింగ్ ఎంపికలు, కుటుంబ ఆరోగ్యంపై వాటి ప్రభావం) శీర్షికన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్; న్యూట్రిషన్-వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి; మ్యాక్స్ హెల్త్‌కేర్- ఢిల్లీ, రీజనల్ హెడ్-డైటెటిక్స్ రితికా సమద్ధార్ పాల్గొన్నారు. ఈ చర్చకు మోడరేటర్‌గా ఆర్‌జె షెజ్జీ వ్యవహరించారు.
ఈ చర్చ ముఖ్యంగా కుటుంబ ఆరోగ్య సమస్యల చుట్టూ కేంద్రీకృతమై జరిగింది. ఈ సమస్యలలో ప్రధానంగా ఊబకాయం, మధుమేహం, కార్డియోవాస్క్యులర్ వ్యాధులు మరియు జీవనశైలి అంశాలు వంటివి ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను వెల్లడించిన ప్యానలిస్ట్‌లు ఇంటి వద్ద ఆలోచనాత్మకంగా తినడం ద్వారా కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగపడుతుందన్నారు.
ఇంటి వద్ద ఆరోగ్యవంతమైన స్నాకింగ్ తీసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మాట్లాడుతూ, భోజనానికి, భోజనానికి మధ్య ఆకలి వేయడం సర్వసాధారణం. మరీ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్‌ను తినడానికి మనం అలవాటు పడిన కాలంలో ఇది మరింత సాధారణమైంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా ఉండటంకోసం, మన ఇంటిలో, మన భోజనాల ప్రణాళికలో ఓ వ్యూహం అనుసరించాల్సి ఉంది. అలా చేస్తున్న కారణంగానే మా కుటుంబంతో పాటుగా, నేను కూడా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం సాధ్యపడుతుంది. నేను మా ప్యాంట్రీలో అసలు జంక్ ఫుడ్ లేకుండా జాగ్రత్తపడుతుంటాను. ఈ స్నాకింగ్స్‌కు బదులుగా నేను పండ్లు, పెరుగు, గింజలు, విత్తనాలు జోడిస్తాను. బాదములు లాంటి గింజలు నిల్వ చేయడానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిని రోజంతా తినవచ్చు. అంతేకాదు షూటింగ్ సమయాలలో కూడా బాదములు నాకు అందుబాటులో ఉంచుకుంటాను. నేను ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా మా అమ్మాయి లంచ్‌బాక్స్ పెట్టే సమయంలో కూడా బాదములు భాగం చేస్తుంటాను.
బాదములలో 15కు పైగా అత్యవసర పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఈ , మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లావిన్,జింక్ మరియు మరెన్నో ఉన్నాయి. ఇవి ఆరోగ్యవంతమైన నేచురల్ స్నాక్‌గా బాదమును మార్చడంతో పాటుగా మన డైట్‌కు జోడించుకోవడానికి అత్యంత అనుకూలమైన ఆహారంగా కూడా నిలుస్తుంది. ఇంటి వద్ద ఈ తరహా ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు చేసుకోవడం వల్ల అనారోగ్యకరమైన రీతిలో బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవడం సాధ్యం కావడంతో పాటుగా ఆరోగ్యం మెరుగ్గా కాపాడుకునేందుకు సైతం తోడ్పడుతుంది అని అన్నారు.
ఇంటి వద్ద ఆరోగ్యవంతమైన రీతిలో ఆహారం తీసుకోవడంతో పాటుగా స్నాక్‌లను సైతం తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించి న్యూట్రిషన్-వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ఆరోగ్య పరంగా ఆందోళనలతో పాటుగా మానసిక సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మన ఆరోగ్యంతో పాటుగా కుటుంబ ఆరోగ్యం పట్ల కూడా పూర్తి ఆప్రమప్తతతో వ్యవహరించాల్సి ఉంది. దీనికోసం ఆలోచనాత్మకంగా ఆహార ప్రాధాన్యతలను ఎంచుకోవడంతో పాటుగా ఇంటిలో కూడా ఆరోగ్యవంతమైన ఆహార అలవాట్లు చేసుకోవాలి.
భోజనాల నడుమ స్నాక్స్ వల్ల ప్రయోజనాలతో పాటుగా సమస్యలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా అనారోగ్యకరమైన రీతిలో శాచురేటెడ్ ఫ్యాట్ లేదా షుగర్ లేదా ఉప్పులు వల్ల సమస్యలు ఎదురవుతాయి. అయితే, భోజనాల నడుమ ఆరోగ్యవంతమైన స్నాక్స్ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అలాంటి ఆరోగ్యవంతమైన స్నాకింగ్ అవకాశాలలో ఒకటిగా బాదములు నిలుస్తాయి. వీటిని ఆరగించడం సులభం. తీసుకువెళ్లడమూ అంతే! స్కూల్, కాలేజీ, ఆఫీస్... ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. బాదములలో అత్యవసర పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లావిన్,జింక్ మరియు మరెన్నో ఉన్నాయి. ఇవి విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మధుమేహం, బరువు నియంత్రణలో ఉంచడంతో పాటుగా కార్డియో వాస్క్యులర్ రోగాలు దరి చేరకుండా కాపాడతాయి. దీర్ఘకాల ఆరోగ్య లక్ష్యాలను చేరకోవడంతో పాటుగా మన కుటుంబం ఆరోగ్యంగా ఉండేందుకు సైతం తోడ్పడుతుంది అని అన్నారు.
స్మార్ట్ స్నాకింగ్ గురించి మ్యాక్స్ హెల్త్‌కేర్-ఢిల్లీ, రీజనల్ హెడ్-డైటెటిక్స్ రితికా సమద్ధార్ మాట్లాడుతూ, అత్యంత బిజీగా ఉంటూ, ఒత్తిడితో కూడిన రోజువారీ కార్యకలాపాలు కారణంగా ప్రజలు అనారోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారు. అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. వండుకోవడానికి లేదంటే తినడానికి అసలు సమయం చిక్కక పోవడం వల్ల ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవడం లేదా అతి సులభంగా లభించే ప్యాకేజ్డ్ ఆహారాన్ని తినడం అలవాటు చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఇది సాధారణంగా మారింది. కానీ ఇది అతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలైనటువంటి బరువు పెరగడం, మధుమేహం, గుండె సమస్యలు రావడానికి కారణమవుతుంది. మరోవైపు, భారతదేశంలో సెలియాక్ వ్యాధి (ఉదర కుహర వ్యాధి) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక్కడ అధిక సంఖ్యలో ప్రజలు గ్లూటెన్ పదార్ధాలతో అలర్జీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదనంగా, ఆరోగ్య స్పృహ కలిగిన బృందాలలో ఇటీవలికాలంలో ఎక్కువ మంది వెగాన్స్‌గానూ మారుతున్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం మొక్కల నుంచి వచ్చిన ఆహారం తీసుకుంటున్నారు. ఈ ఆందోళనలు, ధోరణులను పరిగణలోకి తీసుకుని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటుగా తమకు ప్రతి రోజూ అవసరమైన ఆహారం గురించి అవగాహన కల్పించుకోవాలని, అందుబాటులోని సౌకర్యవంతమైన ఆహారం ఎంచుకోవాలని నేను సూచిస్తున్నాను.
దీనికోసం ఇంటిలో మన డైట్ పరంగా చిన్నగానే అయినా కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. వేయించిన లేదా ఇతర ఖాళీ కేలరీలతో కూడిన స్నాక్స్‌కు బదులుగా పోషకాహార ఆహారం అయిన బాదములు లాంటివి జోడించడం ద్వారా మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి ఆరోగ్యానికి పూర్తి ప్రయోజనకరంగా ఉంటాయి. నిజానికి యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ (యుకె)లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో క్రాకర్స్‌కు సమానమైన కేలరీలు కలిగిన బాదమలు తీసుకుంటే ఆకలి తగ్గి, అత్యధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవాలనే కోరిక తగ్గుతుందని తేలింది.
సహజసిద్ధమైన, మొక్కల ఆధారిత గ్లూటెన్ ఫ్రీ స్నాక్ బాదములు. పలు పోషకాలు దీనిలో ఉన్నాయి.వీటిలో ప్రొటీన్ అధికంగా ఉంది. ఇది ఆకలిని తీర్చడంతో పాటుగా తగిన శక్తినీ అందిస్తుంది. మజిల్ మాస్ వృద్ధికి, దాని నిర్వహణకు ఇది తోడ్పడుతుంది. అనారోగ్యకరమైన ప్రత్యామ్నాయాలకు బదులుగా ఓ గుప్పెడు బాదములు తీసుకుంటే అది ఆరోగ్యవంతమైన మరియు ప్రభావవంతమైన మార్గంగా నిలువడంతో పాటుగా మీ కుటుంబ ఆరోగ్యం కాపాడుకునేందుకు సైతం తోడ్పడుతుంది. దీర్ఘకాలంలో అది పెనుమార్పులకూ కారణమవుతుంది అని అన్నారు. మీ కుటుంబ ఆరోగ్య ప్రణాళికలో ఓ గుప్పెడు బాదం జోడించడం ద్వారా మీ కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుందనే భరోసానూ పొందవచ్చు.