మొట్టమొదటిసారిగా మణిపాల్ హాస్పిటల్స్ ఏబీఓ- అననుకూల మూత్రపిండ మార్పిడి విజయవంతం
మంగళవారం, 19 అక్టోబరు 2021 (16:23 IST)
మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ విజయవంతంగా తమ మొట్టమొదటి ఏబీఓ- అననుకూల మూత్రపిండ మార్పిడిని గత నెల చేసింది. రోగి యొక్క తల్లి ఈ కేసులో దాతగానూ నిలిచారు. ఆమె యొక్క బ్లడ్ గ్రూప్ ఏబీ గ్రూప్. మరోవైపు, రోగి ఏ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నారు.
మూత్రపిండాల మార్పిడిలో అతి ప్రధానంగా తలెత్తే సమస్య అననుకూల బ్లడ్ గ్రూప్. దాత బ్లడ్ గ్రూప్‌తో, మూత్రపిండాల గ్రహీత బ్లడ్ గ్రూప్ మ్యాచ్‌కాని పరిస్థితులలో, అతని శరీరంలోని ప్రతిరోధక రక్షణ వ్యవస్థలు దాత మూత్రపిండాలను వ్యతిరేకిస్తాయి. ఈ కారణం చేత తీవ్ర సమస్యలు ఎదురై, శస్త్రచికిత్స విఫలం కావొచ్చు. అలా కాకుండా ఉండటం కోసం ఏబీఓ అననుకూలత కలిగిన మూత్రపిండాల మార్పిడి చికిత్సలో ఇమ్యునోలాజికల్ మెకానిజమ్స్ (క్రియాశీల రక్త కణాలలో రక్షణ యంత్రాంగం) అర్ధం చేసుకుని, అతి తక్కువగా యాంటీ బ్లడ్ గ్రూప్ యాంటీ బాడీ టిటర్స్ (ఏబీజీఏటీఎస్) ఉండేలా తగిన చర్యలు తీసుకున్నాము.
ఏబీటీఏటీ అనేది ఎంతమేరకు ఈ ప్రతిరోధకాలను తగ్గించవచ్చనే కొలత. ఈ కేసులో, ఏబీజీఏటీ 1:128గా ఉంది. అందువల్ల, ప్రీకండీషనింగ్ ప్రోటోకాల్‌లో భాగంగా ఒక మోతాదు రిటక్సిమాబ్ (వాపును తగ్గించేందుకు) అందించడంతో పాటుగా మూత్ర పిండాల మార్పిడికి రెండు వారాలకు ముందుగానే ఈ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ కేస్ గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు మూత్రపిండాల మార్పిడి నిపుణులు డాక్టర్ శ్రీధర్ ఏవీఎస్‌ఎస్‌ఎన్ మాట్లాడుతూ, రోగి యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రెండుసార్లు ఇమ్యునో అడ్సారప్షన్ (యాంటీ బాడీలు తొలగించడం మరియు మరీ ముఖ్యంగా రక్తం నుంచి మాలిక్యూల్స్ తొలగించడం ద్వారా దీనిని అనుకూలంగా మలిచే ప్రక్రియ)ను గ్లైకోసార్బ్ (బ్లడ్ గ్రూప్ పరంగా అననుకూలతలు ఉన్న పరిస్ధితిలో అవయవమార్పిడి సాధ్యం చేసేందుకు తోడ్పడే ఉపకరణం) ఉపయోగించి చేశాము. ఒక్కో సెషన్ 12 గంటల పాటు జరిగింది. దీనిని అనుసరించి శస్త్రచికిత్సను ఇతర క్లిష్టమైన ప్రక్రియలను వినియోగించి చేశాము. శస్త్ర చికిత్స అనంతరం మేము, కిడ్నీ గ్రాఫ్ట్ సరిగా పనిచేయకపోవడం వంటి పలు సవాళ్లను ఎదుర్కొన్నాము మరియు ఈ కారణం చేతనే రెండు సెషన్‌ల గ్లైకోసార్బ్ చేయడం జరిగింది.
ఈ రోగిని శస్త్రచికిత్స జరిగిన తరువాత 21 రోజులకు డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ చేసిన అనంతరం రోగి క్రియాటిన్ స్థాయి పెరగడం కూడా చూశాము. ఈ ఇమ్యునోఅడ్సారప్షన్ ప్రక్రియలను మా డయాలసిస్ యూనిట్‌లో నిర్వహించాం. ఈ మార్పిడి జరిగిన 60 రోజుల తరువాత రోగి ఆరోగ్యంగా ఉన్నాడు మరియు అతని క్రియాటిన్ స్ధాయి 1.2 గా ఉంది. డాక్టర్ రవిశంకర్ గంజి– కన్సల్టెంట్ యూరాలజిస్ట్, రెనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌కు ఈ అద్భుతమైన శస్త్రచికిత్సను సాధ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే స్ధిరమైన సహకారం అందిస్తూనే అత్యద్భుతమైన టీమ్ వర్క్‌ను ప్రదర్శించిన మా అనస్తీఫియా బృందం, డయాలసిస్‌టెక్నీషియన్స్, డాక్టర్ ఎం అనుపమ- కన్సల్టెంట్ పాథాలజిస్ట్ మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి ధన్యవాదములు తెలుపుతున్నాము్ అని అన్నారు.
డాక్టర్ సుధాకర్ కంటిపూడి, హాస్పిటల్ డైరెక్టర్, మణిపాల్ హాస్పిటల్స్ మాట్లాడుతూ, విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాలలో విభిన్న ఆరోగ్య సమస్యలకు బహుళ నైపుణ్యాలతో చికిత్సలనందించగల ఒకే ఒక్క హాస్పిటల్‌గా నిలువడం పట్ల మేము గర్వపడుతున్నాము. విస్తృత స్థాయి కేసులను పరిష్కరించడానికి మా వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్సనందించగల ప్రత్యేక వైద్య బృందం ఉంది. మొట్టమొదటి ఏబీఓ- అననుకూల మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసిన మా వైద్యులు, బృందాన్ని అభినందిస్తున్నానుఅని అన్నారు.