గుండె వైఫల్యంతో పాటుగా అరుదైన పారాథైరాయిడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 35 ఏళ్ల మహిళకు విజయవంతంగా విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ), మంగళగిరి చికిత్స చేయడం ద్వారా సంక్లిష్టమైన క్యాన్సర్ కేసులను నిర్వహించడంలో తమ నైపుణ్యంను మరోమారు ప్రదర్శించింది. పారాథైరాయిడ్ గ్రంధులలో పారాథైరాయిడ్ క్యాన్సర్ సంభవిస్తుంది, ఇవి థైరాయిడ్ దగ్గర మెడలో ఉన్న చిన్న గ్రంథులు. ఈ గ్రంథులు పారాథైరాయిడ్ హార్మోన్(పిటీహెచ్)ను ఉత్పత్తి చేస్తాయి, ఇది రక్తంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పారాథైరాయిడ్ క్యాన్సర్‌లో, పిటీహెచ్ యొక్క అధిక ఉత్పత్తికి కణితి కారణమవుతుంది, ఇది రక్తంలో కాల్షియం స్థాయిలను పెంచడానికి కారణమవుతుంది, ఇది ప్రాణాంతకం కావచ్చు.
సాధారణ ఎముకల నొప్పి, బలహీనతతో ఏఓఐకి రోగి వచ్చారు, ఆమె ఆరు నెలలుగా ఈ సమస్యను అనుభవిస్తున్నారు. ఆమె గతంలో నొప్పికి, పారాథైరాయిడ్ చికిత్స తీసుకున్నారు. కానీ ఆమెకు సమస్యకు సంబంధించిన లక్షణాలు కొనసాగుతూనే వున్నాయి. సమస్య తీవ్రత తెలుసుకునేందుకు చేసిన తదుపరి పరీక్షలలో ఆమె రక్తంలో అధిక స్థాయి కాల్షియం, ఎడమ పారాథైరాయిడ్ గ్రంధి అతి చురుగ్గా ఉన్నట్లు వెల్లడైంది, ఈ పరిస్థితిని హైపర్‌పారాథైరాయిడిజంతో కూడిన ప్రైమరీ హైపర్‌కాల్సెమియా అని పిలుస్తారు. మిబి స్కాన్ ఎడమ పారాథైరాయిడ్ గ్రంధి పెరిగినట్లుగా చూపించింది, ఇది అన్నవాహిక(ఆహార పైపు)కు అతుక్కుని ఉంది. దీనికి తోడు, ఆమెకు తేలికపాటి గుండె వైఫల్యంతో ఏట్రియాల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్‌డి) అనే గుండె పరిస్థితి ఉన్నట్లు నిర్ధారణ అయింది.
సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్ పోలవరపు, డాక్టర్ ఇషాంత్ అయినపూరి మాట్లాడుతూ, "రోగి యొక్క గుండె పరిస్థితి, కణితి యొక్క స్వభావం కారణంగా ఇది సవాలుతో కూడుకున్న కేసు. అయినప్పటికీ, మల్టీడిసిప్లినరీ విధానం, జాగ్రత్తగా ప్రణాళికతో, మేము కణితిని విజయవంతంగా తొలగించి, రోగి పరిస్థితిని స్థిరీకరించగలిగాము. ఈ కేసు అరుదైన, సంక్లిష్ట క్యాన్సర్లను నిర్వహించడంలో ప్రత్యేక సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది" అని అన్నారు.
ఆమె గుండె పరిస్థితి, తీవ్రస్థాయికి చేరిన కణితి యొక్క స్వభావం కారణంగా అధిక ప్రమాదాలు ఉన్నప్పటికీ, రోగి ఎడమ థైరాయిడ్ లోబ్, ఎడమ పారాథైరాయిడ్ గ్రంధిని తొలగించే శస్త్రచికిత్సను విజయవంతంగా చేయించుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత, ఆమె పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. IV కాల్షియం సప్లిమెంట్స్ సహాయంతో ఆమె కాల్షియం స్థాయిలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. పరీక్షలో పారాథైరాయిడ్ కార్సినోమా నిర్ధారణ అయింది.
సిటిఎస్ఐ దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది మాట్లాడుతూ, "దక్షిణాసియా అంతటా ప్రపంచ స్థాయి క్యాన్సర్ సంరక్షణను అందించాలనే మా లక్ష్య సాకార దిశగా చేస్తున్న ప్రయత్నాలకు ఈ కేసు ఒక ఉదాహరణ. అద్భుతమైన రీతిలో ఈ రోగి కోలుకోవడం, అరుదైనది లేదా సంక్లిష్టమైనది క్యాన్సర్‌లతో బాధపడుతున్న వారి జీవితాలను మెరుగుపరచడంలో మా అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. ఏఓఐ విజయవాడ యొక్క క్లినికల్ నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికతతో కలిపి, ఈ అరుదైన పారాథైరాయిడ్ క్యాన్సర్‌ను నిర్ధారించడం, చికిత్స చేయడంలో కీలక పాత్ర పోషించాయి. మా నిపుణులైన ఆంకాలజిస్ట్‌ల బృందం, అధునాతన చికిత్స ప్రోటోకాల్‌లు, అత్యంత సవాలుగా ఉన్న క్యాన్సర్ కేసులను కూడా మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని నిర్ధారిస్తాయి. రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను అందజేయడంతో పాటుగా ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఆశించేలా చేస్తాయి" అని అన్నారు.
ఏఓఐ విజయవాడ, RCOO, మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, "ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స విజయం విజయవాడలోని స్థానిక కమ్యూనిటీకి అధునాతన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో ఏఓఐ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. మా సెంటర్ అత్యాధునిక సాంకేతికత కలిగి ఉండటంతో పాటుగా అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందిని కలిగి ఉంది. అత్యంత క్లిష్టమైన కేసులను కూడా కచ్చితత్వంతో, నైపుణ్యంతో నిర్వహించేందుకు ఇది మాకు వీలు కల్పిస్తుంది. మా పేషెంట్లు తమ ఇంటి నుండి ఎక్కువ దూరం ప్రయాణించకుండానే ఉత్తమమైన సంరక్షణను పొందగలరనే భరోసా అందజేస్తూ, విజయవాడలో ప్రపంచ స్థాయి చికిత్సా ఎంపికలను అందించడం మాకు గర్వకారణంగా వుంది. ఈ విజయం మా సామర్థ్యాలను ప్రదర్శించడమే కాకుండా, క్యాన్సర్ చికిత్స ఫలితాలను మెరుగుపరచడం, ఈ ప్రాంతం అంతటా రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచాలనే మా లక్ష్యంను పునరుద్ఘాటిస్తుంది" అని అన్నారు.