స్మార్ట్ ఫోన్లు వాడితే పేలు పడతాయట.. సెల్ఫీలు దిగితే..?

మంగళవారం, 12 నవంబరు 2019 (11:58 IST)
అవును స్మార్ట్ ఫోన్లు వాడితే పేలు పడతాయట. పిల్లల తలల్లో పేలు వుంటాయి. స్కూళ్లకు వెళ్లిన పిల్లలు పక్కన వారితో ఎక్కువగా తిరగడం, చనువుగా వుండటంతో వారి తలలోని పేలు వీరి తలలోకి ఎక్కుతాయని చెప్తుంటారు. 
 
అయితే తాజాగా స్మార్ట్ ఫోన్ కారణంగా తలలోకి పేలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. అదెలాగంటే.. తల్లో పేలు ఎగరలేవు, దూకలేవు. కొత్త వ్యక్తి జుట్టు తాకగానే.. ఆ వెంట్రుకలను పాకుతూ వారి తలలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత ఎక్కువగా సెల్ఫీలు దిగుతున్నారు. 
 
ఇక చిన్న పిల్లలు కనపడినా చాలు వారితో సెల్ఫీ దిగడానికి ఆసక్తి చూపించి దగ్గరగా తీసుకుని సెల్ఫీ దిగుతూ ఉంటారు. దీనితో వారి తలలో ఉన్న పేలు వీరి తలలోకి వస్తూ ఉంటాయట. అందుకే స్మార్ట్‌ఫోన్‌తో ఫోటో దిగేటప్పుడు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 
 
పేలు వచ్చాక వెంటనే తెలియదు. కొన్ని రోజుల తర్వాత అలర్జీ లాంటి లక్షణాలు కనిపించి అప్పుడు పేలు ఉన్న విషయం బయటపడుతుంది. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం బయటపడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు