మళ్లీ కరోనా వైరస్ బుసలు కొడుతుంది. ఒక్క మన దేశంలోనేకాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ విస్తరిస్తుంది. మన దేశంలో కేరళ రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మరింత అప్రమత్తతో వ్యవహరించాలని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రకరకాల మాస్క్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ మాస్కులేమిటో చూద్దాం.
గుడ్డ మాస్కులు
మాట్లాడేటప్పుడు నోటి తుంపరలు బయటకు రాకుండా.. జలుబు ఉన్నప్పుడు వైరస్ వ్యాపించకుండా ఈ గుడ్డ మాస్కులు ఉపకరిస్తాయి. అలాగే, ఇతరుల నుంచి వైరస్‌లు సోకకుండా కూడా ఇవి ఉపకరిస్తాయి. అయితే వీటిని జాగ్రత్తగా ధరించాలి. ప్రతి రోజు వీటిని ఉతకాలి.