సాధారణంగా చాలా మంది బాత్రూమ్‌లో ఉన్నపుడు గుండెపోటుకు గురవుతూ ప్రాణాలు విడుస్తుంటారు. ఇలాంటి వార్తలను చాలానే వింటుంటాం. తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఇలానే చనిపోయారు. అయితే, బాత్రూమ్‌లో ఉన్నప్పుడు గుండెపోటుకు గురైన సందర్భాలు అనేకం. దీనికి గల కారణం ఏమిటో ఓసారి పరిశీలిద్ధాం.
దీనిపై పలువురు వైద్య నిపుణులు స్పందిస్తూ, 'చాలామంది స్నానం చేసే క్రమంలో ముందుగా తమ తలను తడుపుకుంటారు. అది తప్పుడు పద్ధతి. అలా చేయడం వల్ల వేడి రక్తం గల మానవ శరీరం ఒక్కసారిగా ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోలేదు. ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకునే క్రమంలో నీళ్లు పడిన తల భాగం వైపునకు రక్త ప్రసరణ ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఎవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటుకు కారణమవుతాయి.
ఈ కారణంగా ఒక్కోసారి పక్షవాతం కూడా రావొచ్చు. అలా కాకుండా స్నానం చేసేటపుడు ముందుగా పాదాల నుంచి పైకి నీటిని వేసుకోవడం మంచి పద్ధతి. ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మైగ్రేన్‌తో బాధపడుతున్నవారు స్నానం చేసేటపుడు ఈ పద్దతినే పాటించాలని సలహా ఇస్తున్నారు.