కేన్సర్‌కు విరుగుడు జీబ్రా ఫిష్...

శనివారం, 21 జులై 2018 (12:35 IST)
ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధి కేన్సర్‌కు మందు లేదు. ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే, రేడియేషన్‌ చేయడం వల్ల కేన్సర్ బారి నుంచి కొంతమేరకు బయటపడొచ్చు. అ.యితే, కేన్సర్ వ్యాధికి విరుగుడుగా ఓ చేపను కనుగొన్నారు. ఈ చేపను ఆరగించడం వల్ల కేన్సర్ బారిన పడొచ్చని అంటున్నారు.
 
అయితే, ఈ చేప ఎక్కడపడితే అక్కడ లభించదు. చాలా అరుదైన చాప. ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు నియంత్రణలకు లోబడి కోతులు, ఎలుకలు వంటి జీవులపై చేస్తున్న ఔషధ ప్రయోగాలను కొత్త బాట పట్టించింది. మానవుల మాదిరిగా అవయవాలను కలిగి ఉండటం శతకోటి మత్స్యాల్లో ఒక చేపైన ఈ జీబ్రా ఫిష్‌ని ప్రత్యేకంగా నిలబెట్టింది. అంతేకాదు.. ఈ అవయవాలను పునరుత్పత్తి చేసుకోగల సామర్థ్యం కారణంగా శాస్త్రవేత్తలు వీటిని ప్రయోగాలకు ఎంపిక చేసుకొంటున్నారు. 
 
ప్రస్తుతం ఈ జీబ్రా ఫిష్‌ను వివిధ రకాల కేన్సర్‌లకు ప్రత్యేకమైన మందులు కనిపెట్టే పరిశోధనల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ చేపల్లో కేన్సర్ ట్యూమర్లను ఎక్కించి వివిధ రకాల ఔషధాల శక్తిసామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. దీనివల్ల మానవులకు ప్రతి ఒక్క కేన్సర్‌కు ప్రత్యేకమైన మందులు, చికిత్సా విధానం తయారు చేయడం వీలవుతుందని సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
ప్రస్తుతం సీసీఎంబీ జీబ్రా ఫిష్‌లో బ్రెస్ట్ కేన్సర్‌పై పరిశోధనలు జరుపుతోంది. చేపలో ట్యూమర్ ప్రవేశపెట్టి కణాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి? వాటి విస్తరణ, మందులతో వాటిని నియంత్రించే విధానాలను పరిశీలిస్తున్నారు. కేన్సర్‌, బ్రెయిన్‌ ట్యూమర్‌, టీబీ, మానసిక ఆరోగ్యం, అండోత్పత్తి వంటి వివిధ రకాల పరీక్షలు, పరిశీలనల దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు