అంగం స్తంభిస్తోంది... భార్య సహకరిస్తోంది... కానీ భావప్రాప్తి కలగడంలేదు...

సోమవారం, 7 జనవరి 2013 (15:16 IST)
WD
రతిలో చాలామంది ఎదుర్కొనే సమస్య భావప్రాప్తి. కొంతమంది పురుషుల్లో రత్యాసక్తి, అంగస్తంభన వున్నప్పటికీ వారిలో క్లైమాక్సులో భావప్రాప్తి అనుభవించక ఇంకా కావాలనుకుంటారు. ఇక భార్యల్లో సైతం లైంగిక వాంఛ తగిన స్థాయిలో ఉండీ, యోని ద్రవాలు, సాధారాణంగానే ఉన్నప్పటికీ భావప్రాప్తి సమస్య ఎదుర్కొంటుంటారు.

ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి లైంగిక సామర్థ్యం భేషుగ్గానే ఉంటుంది. కానీ భావప్రాప్తి అనుభవం పొందక ఇబ్బందిపడుతుంటారు. దీనికి కారణం రతి పూర్తయ్యే ముందు వారు చేస్తున్నదే. భావప్రాప్తి స్థాయికి చేరుకోక మునుపే రతిని ఆపేయడమే ప్రధాన కారణం. రతి ప్రక్రియ తెలియని వారిలోనే ఈ సమస్య తలెత్తుతుంది.

సెక్స్ పొజిషన్, మూవ్‌మెంట్లు తెలియకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. కొంతమందిలో భంగిమ సక్రమంగా లేకపోవడం, కొందరి మగవారిలో అంగప్రవేశం కాగానే స్ఖలనం అయిపోవడం మూలంగా ఇలా జరుగవచ్చు. తగిన లైంగిక భంగిమలు, కదలికల పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. వీటితోపాటు వారి సహజీవనంలో ఉండే గృహసంబంధమయిన విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఏవండీ "అక్కడ" కాదని భార్య చెప్పినప్పుడు నీకీ నాలెడ్జ్ ఎలా వచ్చిందే...? అని ఆమె శీలాన్ని శంకించే మగధీరులూ ఉంటారు. కానీ వాళ్లకు తెలియంది ఏమంటే... అలా చెప్పేందుకు కామన్ సెన్స్ చాలు. కనుక సెక్స్ సమయంలో భార్యభర్తల మధ్య భావప్రాప్తి మాటల గోప్యత వల్ల రాదు. సుఖం కోసం ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటూ భంగిమలను మార్చినప్పుడే అది లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి