సహజంగా మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు కోర్కెలు విజృంభిస్తాయనడంలో సందేహం లేదు. ఆ కోర్కెల్లో ఎక్కువగా శృంగారానికి సంబంధించిన అంశాలే ఉంటాయి. ప్రస్తుతం యువత దేనికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారని పరిశోధనలు చేసినప్పుడు తమ శృంగార కోర్కెలు తీర్చుకోవడానికేనని వివిధ పరిశోధనల్లో తేలినట్లు నిపుణులు తెలిపారు. ఐతే శృంగారాన్ని సక్రమమైన మార్గంలో అనుభవించనివారు జీవితంలో చాలా కోల్పోతారని కూడా నిపుణులు చెబుతున్నారు.
మంచి సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి, తాము ప్రేమలో మునిగితేలుతున్నామని చెప్పడానికి, అసలు శృంగారం అంటే తెలుసుకోవడానికి అని చాలా మంది చెప్పినట్లు శాస్త్రజ్ఞులు జరిపిన సర్వేలో తేలింది. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ వాంఛను తీర్చుకుంటున్నారు.
ప్రేమ, ఆకర్షణ, పిల్లలు పుట్టాలనే కోరికతో తాము అధికంగా శృంగారంలో పాల్గొంటున్నామని మరి కొందరు చెబుతున్నారని తమ సర్వేలో తేలిందని అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధకుల బృందం తెలిపింది. శృంగారంలో పాల్గొనడానికి కారణాలు తెలిసినప్పటికీ వారు సరిగా చెప్పలేక పోయారన్నారు. కొందరు ప్రేమ కోసమంటే మరికొందరు తమ కోపాన్ని, తాపాన్ని తగ్గించుకునేందుకే పాల్గొన్నామన్నారు.
శృంగారంలో పాల్గొంటే అందులోని తృప్తి మాటల్లో చెప్పలేమని, ఇలా పాల్గొనడం ద్వారా శారీరక ఉత్తేజం కలుగుతుందని చాలా మంది చెప్పారని ఆయన తెలిపారు. స్త్రీలు మాత్రం కేవలం తమ భాగస్వామిని సంతృప్తిపరచడానికే పాల్గొంటున్నామని చెప్పారు.