అంగ స్థంభనకు వయాగ్రా మాత్రలు వాడితే హానికరమా?

గురువారం, 18 జులై 2013 (17:36 IST)
File
FILE
చాలా మంది మధ్య వయస్కులకు అంగ స్థంభన ఓ సమస్యగా ఉంటుంది. దీంతో తమలోని సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయగ్రా వంటి మాత్రలను వాడుతుంటారు. ఇలాంటి మాత్రలు వాడటం వల్ల అంగ స్థంభన సమస్య బాగానే ఉన్నప్పటికీ.. వీర్య స్ఖలనం బాగా తగ్గిపోతుందని చాలా మంది చెపుతున్నారు. అంటే వయాగ్రా వాడితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయా అనే అంశంపై వైద్యులను సంప్రదిస్తే...

యాభై ఏళ్ళ వయస్సులో రోజుకు 2 సార్లు శృంగారంలో పాల్గొంటూ కూడా వయాగ్రా వాడటం భావ్యం కాదు. ఇలా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెపుతున్నారు. ముఖ్యంగా బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టయితే ఈ మందులు ఒక్కోసారి ప్రమాదానికి దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఒకసారి వీర్య స్ఖలనం అయినా మళ్లీ అంగస్థంభన కావడానికి గంట, రెండు గంటల సమయం పడుతుందని అందువల్ల వయాగ్రా వంటి మాత్రంలు వాడటం వల్ల కూడా ప్రయోజనం ఉండదన్నారు.

వెబ్దునియా పై చదవండి