ఆడవారితో పురుషులు తరచుగా చెప్పే అబద్ధాలేంటి?

మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (16:57 IST)
File
FILE
స్త్రీ పురుషులు తమ కామవాంఛ అవసరాల కోసం ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పుకుంటుంటారు. ఇలా అబద్ధాలు చెప్పే వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ అబద్ధాలు చెపుతున్నట్టు సమాచారం. ఆడవాళ్లు ఏదైనా గొడవ మొదలుపెడితే ఆ గొడవను ఆపడానికి, తమ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను సంతోష పరచడానికి పురుషులు అబద్ధాలు చెపుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆ అబద్ధాలు ఏంటో ఇక్కడ చూద్ధాం.

నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బ్రతకలేనని భార్యతో పదేపదే అంటుంటారు. కానీ వాస్తవమేంటంటే మగవారు ఒక్కసారి విందు వినోదాలలో మునిగితే ఆడవారు అసలు గుర్తుకే రారట. ఏదైనా తమకు తెలియని విషయాన్ని ఆడవారి ముందు ఒప్పుకోడానికి మగవారికి నామోషీనట. ఆడవారికి తెలిసిన విషయాన్ని మగవారు తమకు తెలియకపోయినా తెలుసని బుకాయిస్తారట, అలా ఇలా మాటల్లోకి దింపి ఆ విషయాన్ని మొత్తానికి ఆడవారి నుండే రాబడుతారట.

నీకు తప్ప మరో అమ్మాయికి కలలో కూడా చోటులేదు. మగవారు తమ కలలో వారి వారి స్వప్నసుందరులను ఊహించుకుంటూ కలలు కంటారట. ఒకవేళ నిద్రలో కలవరిస్తూ దొరికిపోయినా ఛా.. నా జీవితంలోనే కాదు కలలో కూడా నీకు తప్ప మరొకరికి చోటులేదని భార్యను మభ్యపెడుతారట.

మర్చిపోలేదు.. గుర్తుంది.. మగవారు మరీ తరచుగా ఈ వాఖ్యానాన్ని ఆడవారి వద్ద వాడేస్తారట. ఆడవారు ఏమైనా తీసుకురమ్మని చెబితే అవి మరిచిపోవడమే కాక నువ్వు చెబితే మరిచిపోతానా. వేరే పని ఉండి అటువైపుగా వెళ్లలేక పోయా. రేపు ఎంతపని ఉన్నా ఖచ్చితంగా తీసుకువస్తానని తప్పించుకుంటారట.

మగవారు తమ పార్ట్‌నర్లతో ఉన్నపుడు ఎవరైనా అందమైన ఆమ్మాయిలు వారి ముందుగా వెళితే కళ్లు వాటంతటవే వారి వైపు తిరుగుతాయట. ఆడవారు ఆ విషయం గమనించి అడిగితే చూసి కూడా చూడలేదనీ, నువ్వు పక్కనుండగా మరొకరెందుకని ఈజీగా బుకాయించేస్తారట.

ప్రతి భర్త.. తన భార్య వద్ద చెప్పే ప్రధాన అబద్ధం ఇంకెప్పుడూ మందు తాగను. అప్పటికీ నీకు నేను మందు తాగడం ఇష్టం లేదనే చెప్పా. కానీ వాళ్లు వింటేగా బలవంతంగా తాగిం చేశారు అంటూ మగవారు ఇలా మొదలెడతారట.

కానీ వాస్తవమేంటంటే ఒకరు బలవంతం పెట్టే విషయం పక్కన పెడితే మందు తాగేప్పుడు భార్యకు ఇష్టం లేదన్న మాట మగవారికి గుర్తుకేరాదట. ఒకవేళ వచ్చినా పైన చెప్పినట్లు సాకు చెప్పి తప్పించుకోవచ్చనే ధీమాతో వారు పీకల వరకు మద్యం సేవిస్తారట.

వెబ్దునియా పై చదవండి