కామ వాంఛ తీర్చుకునేందుకు కేరాఫ్ అడ్రెస్ బీచ్: డ్రీమ్ సెక్స్

WD

బీచ్‌కెళదాం రా..!!

శృంగార సంబంధాలు, ఇంకా చెప్పాలంటే కామ వాంఛలు తీర్చుకోవడం గురించి ఎన్నెన్నో ఊహలు. దీనికే సెక్సాలజిస్టులు ఫాంటసీ అని పేరు పెట్టారు. అంటే.. కలల్లో సెక్స్ విహారం. కొందరు ఇందుకు ఏకాంత ప్రదేశాలను ఇష్టపడితే, మరికొందరు చట్ట విరుద్ధమైన, అనుచిత ప్రదేశాలను ఊహించుకుంటున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.

అనైతిక పద్ధతిలో కామవాంఛ తీర్చుకోవడమనే ఊహలలో మరికొందరు విహరిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. ఇంటిలో రతి జరుపుకోవడం సరైనదే. ఇది ఊహల సంగతి. ఇక వాస్తవానికి వస్తే...ఇల్లు ఇరుకుగా ఉన్నప్పుడూ... ఆ వ్యవహారాన్ని ఇంట్లో కానించే అవకాశం లేనప్పుడు... వారి చూపు ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లుతున్నదట.

ఇంట్లో ఈ కార్యకలాపం కుదరదు గనక అందుకు బీచ్ ఒడ్డులలో ఉన్న రిసార్ట్‌లను ఎంచుకుంటున్నట్లు తేలింది. మొత్తమ్మీద బెడ్రూమ్ శృంగారం క్రమంగా బీచ్ ఒడ్డున శృంగారంగా మారుతున్నట్లు అర్థమవుతుంది.

ఇలా ఇంట్లో కాక మిగిలిన ప్రదేశాలలో సెక్స్ చేసుకుంటున్నవారి సంఖ్య దాదాపు 40 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అలాగని జన సంచార ప్రదేశంలో జరిగితే ప్రజల మనోభావాలను నైతిక విలువలను, సంప్రదాయాలను దెబ్బతీసినట్లవుతుంది. అందువల్ల రతిక్రియను పడగ్గదిలో చేసుకోవాలనే అభిప్రాయాలను 60 శాతం కట్టుబడి ఉన్నట్లు వెల్లడైంది.

వెబ్దునియా పై చదవండి